MBNR: హామీలు అమలు చేయడంలో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఆయన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా అందివ్వలేని చేతగాని ప్రభుత్వం అని అన్నారు.