NZB: సైబర్ క్రైమ్ జరిగిందని గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం ఎస్పీ సాయిశ్రీ సూచించారు. కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బుధవారం సైబర్ క్రైంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే మొదటి గంటను గోల్డెన్ అవర్గా గుర్తించి 1930కు కాల్ చేయాలని సూచించారు.