BPT: సంక్రాంతి వేళ రావినూతల RSCA స్టేడియం క్రికెట్ పండుగకు వేదిక కానుంది. గత మూడు దశాబ్దాలుగా ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లను ఆకర్షించిన ఈ టోర్నీ, జనవరి 9 నుంచి ప్రారంభం కాబోతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల జట్లు పాల్గొంటున్న ఈ పోటీలకు, స్థానికుడైన ప్రముఖ సినీ నటుడు గిరిబాబు హాజరవుతారని సంస్థ అధ్యక్షుడు నాగేశ్వరరావు గురువారం వెల్లడించారు.