అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా బల్లా పల్లవి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు పాలకమండలి సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరుకానున్నారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పల్లవి పేర్కొన్నారు.