ATP: తాడిపత్రిలోని చారిత్రాత్మక శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ అలంకారాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.