MBNR: సీఎం కప్ టోర్నమెంట్‌తో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో సీఎం కప్ టోర్నమెంట్ సందర్భంగా టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు.