వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ మక్కలు బిల్టి ధర రూ. 2080, క్వింటాల్ పచ్చి పల్లికాయ ధర రూ. 5600, క్వింటాల్ సుక పల్లి కాయ ధర రూ. 8950 గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్లో చిరుధాన్యాల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు.