రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న రిలీజ్ కానుంది. ఇవాళ ఈ మూవీ ప్రీమియర్స్ షోలు ఉండగా.. తెలంగాణలో ఇంకా ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అయితే టికెట్ ధర పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచిస్తోంది. ఇప్పటికే టికెట్ ధరలు పెంచాలని నిర్మాత దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ ఆదేశాల కోసం మేకర్స్‌తో పాటు అభిమానులు ఎదురుచూస్తున్నారు.