WNP: రోడ్డు భద్రత నియమాలను పాటించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రజిని అన్నారు. గురువారం పెబ్బేరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు రహదారులపై సూచించిన రోడ్డు భద్రత గుర్తులను అనుసరించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు తగ్గించ వచ్చున్నారు.