ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు బుధవారం ఉదయం కురుగుంట గ్రామపంచాయతీ పరిధిలోని వైయస్సార్, సేవాలాల్ కాలనీల్లో రూ.45 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.