AP: అనంతపురం జిల్లా సింగనమల టీడీపీలో వర్గవిభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే శ్రావణి, ఆలం నరసానాయుడు అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సింగనమల మండలం నాగులగుడ్డం తండాలో సీసీ రోడ్ల పనులు చేపట్టే విషయంలో వివాదం తలెత్తింది. MLA వర్గం పనులు చేపట్టడంతో మరో వర్గం అడ్డుకుంది. దీంతో పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.