MDCL: హబ్సిగూడ నుంచి నాచారం వెళ్లే మార్గాల్లో, హబ్సిగూడ సిగ్నల్ వద్ద ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ పదేపదే జరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీని పై పలుమార్లు పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేదు. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ జరగడం కారణంగా రోడ్డుపై రద్దీ పెరుగుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.