టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో చోటు దక్కాలంటే ముంబై, ఢిల్లీ లేదా పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలని అతడు అన్నాడు. జట్టులో ఆ రాష్ట్రాల ఆటగాళ్లకు మాత్రమే సుస్థిర స్థానం ఉంటుందని వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుతం భారత జట్టులో సగానికి పైగా ఆటగాళ్లు ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం గమనార్హం.