MNCL: మంచిర్యాలలో అర్హత, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్యుల క్లీనిక్లలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. టీజీఎంసీ సభ్యులు డాక్టర్ ఎగ్గెన శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో రోగులకు వైద్యం చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.