BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ జాబితా సవరణల ప్రక్రియ వేగవంతమైంది. జాబితాలో తప్పుల సరిదిద్దులకు ఇప్పటివరకు 85 మంది దరఖాస్తులు చేశారు. కౌన్సిలర్ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆధారాలతో అభ్యంతరాలు సమర్పించారు. 30 వార్డుల్లో 53,314 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత ఈ నెల 10న తుది జాబితా విడుదల చేస్తారు.