MDK: విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ను TUWJU నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ రియాజుద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఇంతియాజుద్దీన్, సబ్దర్ అలీ, యూసుఫ్ అలీలు ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.