SKLM: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఇవాళ హిరమండలం నౌగూడ గ్రామ చెరువులో ఎమ్మెల్యే చేప పిల్లలను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..100 శాతం సబ్సిడీతో గిరిజన మత్స్యకారులకు ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.