హన్మకొండ జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అపర్ణ దేవి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి కాళోజి జంక్షన్ వరకు సాగిన ఈ ర్యాలీలో వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలనే సందేశాన్ని ప్రజలకు అందించారు.