కృష్ణా: అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో సానుకూలంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల వద్ద నుండి అర్జీలను సోమవారం స్వీకరించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.