TG: ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల సమస్యల పరిష్కారం కోసం BRS ఆందోళనను మరింత ఉధృతం చేసింది. వర్షాల వల్ల రంగుమారిన సోయాను మద్దతు ధరతో ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో నేడు కీలక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కలెక్టరేట్ ముట్టడికి ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే రేపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది.