అనకాపల్లి: పట్టణ సుంకర మెట్ట వద్ద గల సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి భక్తులు శనివారం సారె సమర్పించారు. ముందుగా మహిళలు వివిధ రకాల పిండి వంటలు తయారుచేసి పండ్లు పుష్పాలతో సారెను పట్టణంలో పురవీధుల్లో ఊరేగించిన అనంతరం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించారు.