SS: జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని పటిష్ఠంగా నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు చేశారు. పుట్టపర్తి, కదిరి, మడకశిర, ధర్మవరం, పెనుకొండ డివిజన్లలో క్లినిక్లు నిర్వహించాలన్నారు.