కర్నూలు: జర్నలిస్ట్ కాలనీ శిల్ప టౌన్ షిప్‌కు చెందిన కళ్లే దినేశ్ కుమార్ (14) శుక్రవారం స్కూల్‌కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయల్దేరి తిరిగి రాలేదు. భాష్యం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి మద్దిలేటి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పి.శేషయ్య తెలిపారు.