GNTR: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ను ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై జగన్ ఆరా తీసినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ శ్రేణుల పనితీరుపై జగన్ కీలక సూచనలు చేశారు.