కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. సోమవారం కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. మొదటి నుంచి తాము క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.