SRCL: రబీ సీజన్ పంటల సాగు కోసం జిల్లాలోని ప్రాజెక్టుల నుంచి ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నీటి పారుదల శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి మట్టాలను బట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.