TG: శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అణగదొక్కుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ RTC డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టడంతో జోగురామన్న సహా ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.