కోనసిమా: ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఇరుసుమండలో గ్యాస్ బ్లో అవుట్ జరిగి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన..ONGC వాడకంలో లేని బావులను శాశ్వతంగా మూసివేయకుండా, సొమ్ము కోసం ప్రైవేటు సంస్థలకు అమ్మేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.