KMR: నాగిరెడ్డిపేట మండలం తాండూర్,అక్కంపల్లి గ్రామాల్లో మంగళవారం పశు వైద్యాధికారులు గొర్రెలు, మేకలకు నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా యజమానులు తప్పనిసరిగా ఈ మందులు వేయించాలని సూచించారు. మొత్తం 825 గొర్రెలు,568 మేకలకు మందులు వేసినట్లు తెలిపారు.