MHBD: తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామ సర్పంచ్ పయ్యావుల కళావతి- ప్రవీణ్ సోమవారం వరంగల్ ఎంపీ కడియం కావ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పోలేపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని ఎంపీకి వినతి పత్రం అందజేశారు. గ్రామాభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని ఎంపీని కోరారు. దీనికి ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.