KMM: ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ కార్యాలయంలో సర్వపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిబంధనలు, ఓటరు జాబితా మరియు ఏర్పాట్లపై కలెక్టర్ చర్చించనున్నారు. ఎన్నికల పారదర్శకత ముఖ్యమని పేర్కొన్నారు.