KNR: గొల్లపల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని, పాఠశాలలో ఆహార మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను పాఠశాల నుంచి పంపించారని సమాచారం. ప్రస్తుతం బాలసదనంలో ఉన్న ఆమెకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.