PPM: శీతకాల ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలో మంచు దట్టంగా కురుస్తుంది. గత నాలుగైదు రోజులుగా మంచు కారణంగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఉదయం 8 వరుకు మంచు పడుతుండడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. ఉదయం వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళు, వృద్దులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.