SDPT: జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ ఆలయం వద్ద బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో రవికుమార్, సిద్దిపేట జిల్లా డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ లెక్కింపులో 88 రోజుల వ్యవధికి గాను రూ.7,18,878 వచ్చినట్లు వెల్లడించారు. ఆదాయాన్ని అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని తెలిపారు.