AKP: జిల్లాలో ఈనెల 10 నుంచి సంక్రాంతి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో తరగతులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం డీఐఈవో వినోద్ బాబుకు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబ్జి, ఫణింద్ర కుమార్ వినతిపత్రం అందజేశారు. పరీక్షల పేరుతో తరగతులు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.