ELR: ఆగిరిపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో ఎక్సైజ్ పాత నేరస్తులను ఇవాళ బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ ఏ.మస్తానయ్య మాట్లాడుతూ.. బైండోవర్ ఏడాది కాలం ఉంటుందన్నారు. క్రమశిక్షణతో జీవించకుండా ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే లక్ష రూపాయలు జరిమానా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించారు.