తవణంపల్లి మండలంలో గత ప్రభుత్వ కాలంలో నిర్వహించిన రీ సర్వే కారణంగా రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల తహసిల్దార్ ఎస్. మాధవ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి మధు కుమార్ యాదవ్, రైతు కార్యదర్శి బాబు నాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.