PDPL: జిల్లాలోని గోదావరిఖని, గోలివాడ, నీరుకుల్లలో సమ్మక్క జాతర ఏర్పాట్ల పురోగతిపై అదనపు కలెక్టర్ వేణు శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు వస్తారని, వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆర్డీవో సురేష్, ఏసీపీ కృష్ణ పాల్గొన్నారు.