వెనెజువెలాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వెనెజువెలా గగనతలాన్ని ఉపయోగించొద్దంటూ తమ ఎయిర్లైన్లకు యూఎస్ నోటమ్ జారీ చేసింది. వెనెజువెలా తమ దేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తోందని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. వెంటనే పంపిణీ ఆపేయాలని లేకపోతే దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా దాడులకు పాల్పడింది.