NLG: జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నామమాత్రంగా సాగిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 2, 3 తేదీల్లో జరిగిన వేడుకలో కొత్త ఆవిష్కరణలు కరువయ్యాయని, పాత ప్రాజెక్టులనే ప్రదర్శించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ప్రచారంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థులను ప్రోత్సహించడంపై చూపలేదని విద్యావేత్తలు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.