SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని 27వ వార్డు టీచర్స్ కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారిందని స్థానికులు ఆదివారం తెలిపారు. కుక్క కాటువల్ల వచ్చే రేబీస్ వ్యాధికి పూర్తి చికిత్స లేకపోవడంతో, ఒక కాటు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.