NLR: మనుబోలు మండలం అక్కంపేట మిటాత్మకూరు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలహాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న దంపతులు, వారి పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రజలు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.