AP: తిరుపతిలో హల్చల్ చేసిన మందుబాబుకు రిమాండ్ విధించారు. నిజామాబాద్ జిల్లా వాసి తిరుపతి నిన్న అర్ధరాత్రి గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకెక్కిన విషయం తెలిసిందే. అయితే, తిరుపతి కుటుంబంతో గొడవపడి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, ఆలయ భద్రత విషయంలో నిర్లక్ష్యంపై టీటీడీ చర్యలు తీసుకుంది. విధుల్లో ఉన్న ఆలయ సిబ్బందిపై చర్యలకు నిర్ణయించింది.