NGKL: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామ అభివృద్ధి పనులపై సర్పంచ్ అబ్దుల్ రషీద్ ఆదివారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో చర్చించారు. ఠాగూర్ తండా రోడ్డు నిర్మాణం, గ్రామంలో సీసీ రోడ్లు తదితర పెండింగ్ పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.