TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సూర్యాపేట జిల్లాలో జనంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. హరీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇచ్చే బదులు.. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుండేది అని పేర్కొన్నారు. అలాగే నల్గొండ జిల్లాలోని ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.