KDP: పులివెందుల డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో రేపటి నుంచి అవగాహన గ్రామ సభలు నిర్వహించనున్నట్లు డీడీఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా జీ-రామ్—జీ పథకంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, చెత్త రహిత గ్రామ పంచాయతీలుగా తీర్మానాలు చేయాలని సూచించారు.