PPM: పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఎన్ కే. రాజపురం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న రామమందిరం సమీపంలో అపరిశుభ్రత దర్శనమిస్తోంది. ఇక్కడ పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదు. రోడ్డంతా వ్యర్థాలతో నిండిందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చెత్త తొట్టె సమీప పొలాల్లో పడి ఉందని పేర్కొన్నారు. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలియాజేశారు.