MLG: మేడారం మహా జాతర విజయవంతం చేయడంలో పోలీసు శాఖ పాత్ర కీలకమైందని ములుగు ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకాన్ అన్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర మాస్టర్ ప్లాన్ అమలు కానున్నందున ప్రభుత్వం ఈ యొక్క జాతరను ప్రతిష్టత్మాకంగా తీసుకుందన్నారు. ప్రతి పోలీస్ అధికారి తన పనిని స్వయం బాధ్యతగా తీసుకొని, పూర్తి నిబద్ధతతో పనిచేసి స్పష్టమైన, మెరుగైన ఫలితాలు అందించాలని సూచించారు.