SRD: తొలి మెట్టు (FLN) కనీస సామర్థ్యాలను పెంపొందించాలని MEO నాగారం శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిర్గాపూర్ మండలంలోని పోచపూర్ UPS సందర్శించి తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక హెచ్ఎం, టీచర్లతో సమావేశమై సూచనలు ఇచ్చారు. మూడో తరగతి పిల్లలకు FLSలో మెరుగైన ఫలితాలు రావడానికి పిల్లలు కనీస సామర్థ్యాలైన చదవడం, రాయడం రావాలని HMకు సూచించారు.