SDPT: అక్కన్నపేటలోని MPPSలో నూతనంగా ప్రారంభం అవుతున్న ఫ్రీ ఫైమరి పాఠశాలలో ఉపాధ్యాయులు, ఆయాల పోస్టులకు మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సిద్దిపేట జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయురాలికి రూ. 8,000, ఆయాకు రూ. 6,000 గౌరవ వేతనం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.